19 శాతం పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం, సులభతర వ్యాపారం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా పెరిగాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 19 శాతం పెరిగాయి. 2019-20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం భారత్‌లో 59.64 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. కొవిడ్ మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎఫ్‌డీఐ పెట్టుబడులు పుంజుకున్నాయని […]

Update: 2021-05-24 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయం, సులభతర వ్యాపారం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా పెరిగాయి. సోమవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలు 19 శాతం పెరిగాయి. 2019-20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం భారత్‌లో 59.64 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి.

కొవిడ్ మహమ్మారి వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎఫ్‌డీఐ పెట్టుబడులు పుంజుకున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రీ-ఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఈక్విటీ, మూలధన పెట్టుబడులు అన్ని కలుపుకుని గతేడాది ఎఫ్‌డీఐల విలువ 81.72 బిలియన్ డార్లుగా నమోదైనట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2019-20లో 74.39 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ అని వివరించింది. 2020-21లో భారత ఎఫ్‌డీఐల్లో సింగపూర్ 29 శాతంతో అగ్రస్థానంలో నిల్వగా, అమెరికా 23 శాతం, మారిషస్ 9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అలాగే, 2020-21లో వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐల్లో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ రంగం అత్యధికంగా 44 శాతాన్ని, మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు 13 శాతం, సేవారంగం 8 శాతాన్ని అందుకున్నాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో 37 శాతం దక్కించుకుని గుజరాత్‌ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర 27 శాతంతో, కర్ణాటక 13 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2019-20తో పోలిస్తే, 2020-21లో మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాలు, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, రబ్బరు వస్తువులు, చిల్లర వ్యాపారం, ఔషధాలు, ఎలక్ట్రికల్‌ ఉపకరణాల్లో ఎఫ్‌డీఐల ఈక్విటీ 100 శాతానికి మించి పెరిగింది. 2019-20లో కంటే 2020-21లో ఎఫ్‌డీఐలను అమెరికా 227 శాతం, బ్రిటన్‌ 44 శాతం పెంచాయి. ఎఫ్‌డీఐ ఈక్విటీల్లో 37 శాతం దక్కించుకుని గుజరాత్‌ అగ్రస్థానంలో ఉండగా, మహారాష్ట్ర 27 శాతం, కర్ణాటక 13 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..