‘కరోనాకు తొలి మందు రెమ్‌డెసివిర్’
వాషింగ్టన్: కరోనాకు తొలి మందుగా రెమ్‌డెసివిర్‌ను అమెరికా ఫెడరల్ ఏజెన్సీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదించింది. ఈ మందు సేఫ్టీ, కరోనా నుంచి పేషెంట్లను విముక్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు అమెరికా భావిస్తున్నది. అందుకే రెమ్‌డెసివిర్‌ను వయోజనులు, 12ఏళ్లు పైబడిన పిల్లలకూ ఇవ్వవచ్చునని ఎఫ్‌డీఏ ప్రకటించింది. ఈ ఆపత్కాలంలో కరోనాకు చికిత్సను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నదని, అనేక క్లినికల్ ట్రయల్స్‌లోని డేటాను ఏజెన్సీ కఠినంగా పరిశీలించిన తర్వాతే రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను ఆమోదించినట్టు ఎఫ్‌డీఏ […]
వాషింగ్టన్: కరోనాకు తొలి మందుగా రెమ్‌డెసివిర్‌ను అమెరికా ఫెడరల్ ఏజెన్సీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదించింది. ఈ మందు సేఫ్టీ, కరోనా నుంచి పేషెంట్లను విముక్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు అమెరికా భావిస్తున్నది. అందుకే రెమ్‌డెసివిర్‌ను వయోజనులు, 12ఏళ్లు పైబడిన పిల్లలకూ ఇవ్వవచ్చునని ఎఫ్‌డీఏ ప్రకటించింది. ఈ ఆపత్కాలంలో కరోనాకు చికిత్సను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నదని, అనేక క్లినికల్ ట్రయల్స్‌లోని డేటాను ఏజెన్సీ కఠినంగా పరిశీలించిన తర్వాతే రెమ్‌డెసివిర్ డ్రగ్‌ను ఆమోదించినట్టు ఎఫ్‌డీఏ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హాన్ వెల్లడించారు. ఈ డ్రగ్ కరోనా మరణాలను నిలువరించబోదని, కరోనా నుంచి కోలుకునే కాలాన్ని కుదిస్తుందని మరో నిపుణుడు తెలిపారు. కరోనాను అంతమొందించే శక్తిసామర్థ్యాలు ఈ డ్రగ్‌కు లేదని స్పష్టం చేశారు.