ఫారో దీవుల్లో తిమింగలాల వేట.. రక్తసిక్తంగా మారిన తీరం!
దిశ, ఫీచర్స్ : దైవం పేరున, దెయ్యాల నెపంతోనే కాదు.. ఆచారాలు, మూఢ విశ్వాసాలతోనూ మూగజీవాలను బలిగొంటున్నారు. అంతేకాదు మాంసం, చర్మం, ఇతర అవయవాల కోసం వేటగాళ్లు వేలాది జంతువులను పొట్టన బెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏటా ఫారో దీవుల్లో జరిగే ‘అపార్చునిస్టిస్ వేల్ హంట్’ తిమింగలాలకు మృత్యుపాశంగా మారింది. ఇందులో భాగంగా ఈ ఏడాది 175కు పైగా తిమింగలాలను వేటాడగా, అక్కడి తీర ప్రాంతమంతా రక్తసిక్తమైంది. ‘గ్రైండద్రాప్ లేదా గ్రైండ్’గా పిలువబడే ఈ అమానుషకర […]
దిశ, ఫీచర్స్ : దైవం పేరున, దెయ్యాల నెపంతోనే కాదు.. ఆచారాలు, మూఢ విశ్వాసాలతోనూ మూగజీవాలను బలిగొంటున్నారు. అంతేకాదు మాంసం, చర్మం, ఇతర అవయవాల కోసం వేటగాళ్లు వేలాది జంతువులను పొట్టన బెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఏటా ఫారో దీవుల్లో జరిగే ‘అపార్చునిస్టిస్ వేల్ హంట్’ తిమింగలాలకు మృత్యుపాశంగా మారింది. ఇందులో భాగంగా ఈ ఏడాది 175కు పైగా తిమింగలాలను వేటాడగా, అక్కడి తీర ప్రాంతమంతా రక్తసిక్తమైంది.
‘గ్రైండద్రాప్ లేదా గ్రైండ్’గా పిలువబడే ఈ అమానుషకర వేట, ఫారో దీవుల్లో ప్రతీ సంవత్సరం జూలై- ఆగస్టు నెలల్లో జరుగుతుంది. ఈ క్రమంలోనే దాదాపు 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో తిమింగలాలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వేటలో 175 తిమింగలాలు చనిపోగా.. దశాబ్ద కాలంగా 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్స్ బలైనట్టు తెలుస్తోంది.
సీ షెపర్డ్ దీన్ని ఒక అనాగరికమైన చర్యగా పేర్కొన్నప్పటికీ.. తిమింగలాలు, డాల్ఫిన్స్ వేట అనేది ద్వీపసమూహంలో వార్షిక ఆచారమని, స్థానిక సమాజాలకు ఆహారాన్ని అందించేందుకే ఈ హత్యలు జరుగుతాయని ఫారోస్ ప్రభుత్వం వాదించడం గమనార్హం. దీనికి చట్టపరంగానూ మద్ధతు ఉండగా.. చాలా మంది తమ సంస్కృతిని గౌరవించాలని విదేశీ మీడియా, ఎన్జీఓలను కోరుతున్నారు. అయితే ఇంతటి దారుణమైన వేటను భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు.
కాగా డెన్మార్క్‌లోని ఉండే ఈ ఫారో దీవులు.. సొంత ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని, స్వయం పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. అందువల్ల తమ ఆచారానికి చట్టపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసుకున్నాయి.