పసులకేసె… పారబోసె
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. కూరగాయలు మార్కెట్లకు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే నేడు రైతులు ఊహించని రీతిలో కూరగాయలను మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు దిగొచ్చాయి. కిలో టమాట రూ. 8 కు లభిస్తుండగా.. పచ్చిమిర్చి రూ. 22 కే లభిస్తోన్నది. రైతులు విలవిల.. కరోనా కారణంగా రైతులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చిన్నకోడురు, నంగునూర్, తూప్రాన్, నర్సాపూర్, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, […]
దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చిన విషయం తెలిసిందే. కూరగాయలు మార్కెట్లకు రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే నేడు రైతులు ఊహించని రీతిలో కూరగాయలను మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో కూరగాయల ధరలు దిగొచ్చాయి. కిలో టమాట రూ. 8 కు లభిస్తుండగా.. పచ్చిమిర్చి రూ. 22 కే లభిస్తోన్నది.
రైతులు విలవిల..
కరోనా కారణంగా రైతులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చిన్నకోడురు, నంగునూర్, తూప్రాన్, నర్సాపూర్, గజ్వేల్, జహీరాబాద్, మెదక్, సంగారెడ్డి, దుబ్బాక, దౌలతాబాద్, మిరుదోడ్డి, పటాన్ చేరు మండలాలో అత్యధికంగా రైతులు కూరగాయలను పండిస్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కూరగాయలు నేలపాలతున్నాయి. జిల్లాలోని ఆయా మండలాల్లోనూ ఇదే పరిస్థితి. విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో ఆ పంటలను పండించిన పొలంలోనే వదిలేస్తున్నారు. పశువులు ఉన్న రైతులు మేతకు బదులుగా కూరగాయలనే ఆహారంగా వేస్తున్నారు. కొందరు ఉచితంగా పంపిణీ చేసినా మిగిలిపోతున్నాయి. ఆకుకూరల రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
ఎందుకీ పరిస్థితి..?
సాధారణంగా వేసవిలో కూరగాయలకు చెప్పుకోదగ్గ రీతిలో ధర ఉంటుంది. లాక్‌డౌన్ కొనసాగుతుండటమే ధరలు లేవని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో వచ్చిన దిగుబడిలో 50 శాతం హైదరాబాద్ గుడిమల్కాపూర్, బోయిన్‌పల్లి, కొత్తపేట రైతుబజార్, ఎన్‌టీఆర్ నగర్ మార్కెట్‌కి వెళ్తది. ఇక్కడ నగర అవసరాలకుపోను మిగిలింది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. మిగిలిన 50 శాతం పంటలో కొంత జిల్లా ప్రజల అవసరాలకు పోను.. మిగతాది నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు రైతులు తీసుకెళ్తారు. లాక్‌డౌన్ కావడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోయాయి.
ఇదే తొలిసారి..
‘పండించిన కూరగాయలను పొల్లాలోనే వదిలివేయడం ఇదే తొలిసారి. ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అవకాశం లేకపోవడంతో పశువులకు మేతగా వేస్తున్నాం. ఈ పరిస్థితితో రూ.50 వేల నష్టం వచ్చింది. అధికారులు స్పందించి నష్టపరిహారం అందించేలా చూడాలి’ అని మాచాపూర్ కు చెందిన మహేందర్ రెడ్డి అనే రైతు కోరుతున్నారు.
అవి కూడా రావడం లేదు..
ఎకరం విస్తీర్ణంలో వంకాయలు, రెండు ఎకరాల్లో టమాట పంట సాగుచేశా. రూ.50వేలకు పైగానే పెట్టుబడి కింద ఖర్చు చేశాను. ఈ సీజన్‌లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుందని భావించా. ప్రస్తుతం దిగుబడులు వస్తున్నాయి. కానీ, మార్కెట్‌లో ధరలు లేవు. వంకాయ కిలో రూ.5 లోపే పలుకుతోన్నది. టమాటలు సైతం కిలో రూ.3 నుంచి రూ.5 పలుకుతున్నాయి. ఎంతో కష్టపడి పంట సాగుచేస్తే ఖర్చులు కూడా రావడం లేదు’ అని చౌడారం రైతు నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
tags: Medak, vegetables, low rates, farmers