పురుగుల మందుతో రైతుల పరుగు
దిశ, అమరావతి: తాము సాగు చేసుకుంటున్న భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దని ఆందోళన చేస్తూ కృష్ణా జిల్లా మైలవరంలోని చంద్రగూడెంల్ రైతులు మందు డబ్బాలతో ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములు ఇళ్ల స్థలాలకు ఇస్తే తమ పరిస్తితి ఏంటని రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు. అయినప్పటికీ అదికారులు మొండిగా ప్రవర్తించడంతో పురుగు మందు డబ్బాలతో ఉరుకులు పెట్టారు. అప్రమత్తమైన అదికారులు వారిని ఆపేందుకు తహసీల్దార్ రోహిణిదేవి, ఎస్సై ఈశ్వర రావు రైతుల వెంట పరుగులు […]
దిశ, అమరావతి: తాము సాగు చేసుకుంటున్న భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దని ఆందోళన చేస్తూ కృష్ణా జిల్లా మైలవరంలోని చంద్రగూడెంల్ రైతులు మందు డబ్బాలతో ఆత్మహత్యకు యత్నించారు. ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములు ఇళ్ల స్థలాలకు ఇస్తే తమ పరిస్తితి ఏంటని రెవిన్యూ అధికారులను ప్రశ్నించారు. అయినప్పటికీ అదికారులు మొండిగా ప్రవర్తించడంతో పురుగు మందు డబ్బాలతో ఉరుకులు పెట్టారు. అప్రమత్తమైన అదికారులు వారిని ఆపేందుకు తహసీల్దార్ రోహిణిదేవి, ఎస్సై ఈశ్వర రావు రైతుల వెంట పరుగులు పెట్టారు. ఎట్టకేలకు నచ్చజెప్పి రైతుల ఆందోళన, ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.