ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆందోళన
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. తమ గ్రామంలో ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయండం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బాసర మండలం కిర్గుల్‌బి గ్రామంలో చోటుచేసుకుంది. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని లేకపోతే ధర్నా తీవ్రతరం చేస్తామని మొక్కజొన్న, వరి రైతులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తహసిల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు ప్రారంభించారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తామని […]
దిశ, ఆదిలాబాద్: జిల్లాలో మొక్కజొన్న రైతులు ఆందోళన బాట పట్టారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా.. తమ గ్రామంలో ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయండం లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన బాసర మండలం కిర్గుల్‌బి గ్రామంలో చోటుచేసుకుంది. కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని లేకపోతే ధర్నా తీవ్రతరం చేస్తామని మొక్కజొన్న, వరి రైతులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తహసిల్దార్ శివప్రసాద్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు ప్రారంభించారు. వెంటనే కొనుగోళ్లను ప్రారంభిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
Tags: farmers, protest, paddy purchase centre, adilabad