ఆగ్రహంలో అన్నదాతలు.. మంథని టు గోదావరిఖని రోడ్డు బ్లాక్
దిశ, మంథని : కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ పంటలు మునిగిపోయాయని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మంథని టు గోదావరిఖని ప్రధాన రహదారి సిరిపురం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మూడు సార్లు తమ పంటలు బ్యాక్ వాటర్ వలన నష్టపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు గంట పాటు రైతులు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు […]
దిశ, మంథని : కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో తమ పంటలు మునిగిపోయాయని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మంథని టు గోదావరిఖని ప్రధాన రహదారి సిరిపురం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికీ మూడు సార్లు తమ పంటలు బ్యాక్ వాటర్ వలన నష్టపోయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారు గంట పాటు రైతులు ధర్నాకు దిగారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో మంథని ఎస్‌ఐ చంద్ర కుమార్ ఘటనా స్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సాయంత్రంలోగా సర్వే జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.