ఖమ్మం: చింతకాని ఎమ్మార్వో ఆఫీసులో కలకలం

దిశ‌, ఖ‌మ్మం టౌన్: తన భూమిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా చింత‌కాని మండ‌ల ప‌రిధిలోని వంద‌నం గ్రామానికి చెందిన ఎల్లవుల కృష్ణ అనే రైతు తన భూమికి పాస్ పుస్తకం కోసం ఆరు నెలల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతూ ఉన్నాడు. అయినా అధికారులు ఎంతకీ న్యాయం చేయకపోగా, తన భూమిని సుంకరి లక్ష్మి అనే మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ […]

Update: 2021-02-25 10:05 GMT

దిశ‌, ఖ‌మ్మం టౌన్: తన భూమిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. ఖమ్మం జిల్లా చింత‌కాని మండ‌ల ప‌రిధిలోని వంద‌నం గ్రామానికి చెందిన ఎల్లవుల కృష్ణ అనే రైతు తన భూమికి పాస్ పుస్తకం కోసం ఆరు నెలల నుంచి స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతూ ఉన్నాడు. అయినా అధికారులు ఎంతకీ న్యాయం చేయకపోగా, తన భూమిని సుంకరి లక్ష్మి అనే మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో తీవ్రమనోదనకు గురైన రైతు.. ఎలాగైనా న్యాయం చేయాలంటూ గురువారం చింతకాని తహసీల్దార్ చాంబర్‌లో అతని కుటుంబసభ్యులతో కలిసి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న కార్యాలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాగా.. తన భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయంకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకున్నాడు.

Tags:    

Similar News