కాడెద్దుగా మారిన ఆదివాసి కుమారుడు

దిశ, ఉట్నూర్: వ్యవసాయం కోసం పేద రైతు పడే పాట్లు వర్ణనాతీతం.. అతడి కష్టాలకు ఈ చిత్రం నిదర్శనం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కుకు చెందిన అభిమాన్ ఓ పేద రైతు. పొలంలో దుక్కి దున్నేందుకు సాగు యంత్రాలు తెచ్చుకునే స్థోమత లేదు. దీంతో ఉన్న రెండు ఎద్దులతో పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా పొలాన్ని దున్నుతున్న ఎద్దుల్లో ఒకటి హఠాత్తుగా మరణించింది. దీంతో సగంలో […]

Update: 2021-06-15 01:40 GMT

దిశ, ఉట్నూర్: వ్యవసాయం కోసం పేద రైతు పడే పాట్లు వర్ణనాతీతం.. అతడి కష్టాలకు ఈ చిత్రం నిదర్శనం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కుకు చెందిన అభిమాన్ ఓ పేద రైతు. పొలంలో దుక్కి దున్నేందుకు సాగు యంత్రాలు తెచ్చుకునే స్థోమత లేదు. దీంతో ఉన్న రెండు ఎద్దులతో పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా పొలాన్ని దున్నుతున్న ఎద్దుల్లో ఒకటి హఠాత్తుగా మరణించింది. దీంతో సగంలో పొలం పనులు ఆగిపోయాయి. మిగిలిన పొలాన్ని చదును చేసేందుకు కళ్లేదుట కొడుకు తప్ప మరో మార్గం కనిపించలేదేమో. వ్యవసాయం చేస్తేనే పూటగడవదని ఆ ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చారేమో గానీ.. ఇంటర్ చదివే అభిమాన్ కొడుకు సాయినాథ్(20) పొలాన్ని దున్నేందుకు కాడెద్దుగా మారాడు. ఈ చిత్రాలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News