పల్లెల్లో జోరుగా దళారుల దందా.. పట్టించుకోని మార్కెట్ అధికారులు..

మండలంలో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది.

Update: 2024-11-19 08:15 GMT

దిశ, ఇచ్చోడ : మండలంలో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. మార్కెట్‌ యార్డుల్లోనే కొనాలన్న నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించి పల్లెల్లో దర్జాగా కాంటాలు పెట్టి తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. దీంతో మార్కెట్ ఆదాయానికి గండిపడుతోంది. మార్కెట్ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చిన విడిగా గ్రామాల్లో పల్లెల్లో కాంటాలు పెట్టి రైతులను దోచుకుంటున్నారు. అదేవిధంగా రైతుల పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్న వ్యాపారులు ఇష్టారీతిలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం రైతుల నుంచి పంట దిగు బడులను ఎలక్ర్టానిక్‌ తూకాలతోనే కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఇప్పటికీ పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. సంబంధిత మార్కెట్ అధికారులకు ముడుపులు ముట్టజెప్పడంతోనే అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు దృష్టి సారించి పల్లెల్లో దళారి వ్యవస్థను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


Similar News