సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణకు సంతకాల సేకరణ..
మందమర్రిలోని కేకే 5 బొగ్గుగణి వద్ద సింగరేణిని ప్రైవేట్ పరంగా కాకుండా బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని సంతకాల సేకరణ జరిగింది.
దిశ, మందమర్రి : మందమర్రిలోని కేకే 5 బొగ్గుగణి వద్ద సింగరేణిని ప్రైవేట్ పరంగా కాకుండా బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని సంతకాల సేకరణ జరిగింది. అదే విధంగా వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలి, సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత యువ కార్మికులపై ఉన్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుండి 23వ తేదీ వరకు అన్ని గనుల్లో , కాలనీలో వ్యాపారస్తులు ప్రజలు, యువకులు, విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేసి, గవర్నర్ కు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోషలిస్టు పార్టీ అధ్యక్షులు M.కనకయ్య , బీఎస్పీ చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, సిఐటీయూ మందమర్రి ఏరియా కార్యదర్శి అల్లి రాజేందర్ సీపీఎం నాయకుల తదితరులు పాల్గొన్నారు.