రైతుబంధు ఎఫెక్ట్.. కలెక్టరేట్ ఎదుట సంచలన ఘటన.. వీడియో

దిశ, భూపాలపల్లి : 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న తమ భూములను లాక్కోవద్దంటూ చిట్యాల మండలంలోని వరికోల్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. పరకాల-కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై గురువారం భారీ ఎత్తున ధర్నా చేశారు. తమ భూములు తమకు ఇవ్వాలని చెప్పు జంగమయ్య అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తోటి రైతులు, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రైతు ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్బంగా రైతులు […]

Update: 2021-07-29 03:12 GMT

దిశ, భూపాలపల్లి : 70 సంవత్సరాలుగా సాగు చేస్తున్న తమ భూములను లాక్కోవద్దంటూ చిట్యాల మండలంలోని వరికోల్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. పరకాల-కాళేశ్వరం 353 జాతీయ రహదారిపై గురువారం భారీ ఎత్తున ధర్నా చేశారు. తమ భూములు తమకు ఇవ్వాలని చెప్పు జంగమయ్య అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తోటి రైతులు, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని రైతు ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. నైపాక గ్రామ శివారులో సర్వే నంబర్లు 440, 441, 442, 443లో తమకు భూములు ఉన్నాయని 70 ఏళ్లగా 16 వందల ఎకరాలు 350 కుటుంబాలు ఈ భూమి సాగుచేసుకుంటున్నాయని తెలిపారు. ఇట్టి భూములను ప్రభుత్వం బ్లాక్ల్ లిస్టులో పెట్టి.. తమకు ప్రభుత్వం ద్వారా వచ్చే బ్యాంకు రుణాలను, రైతు బంధు పథకాన్ని రాకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇట్టి భూములను ఆన్‌లైన్‌లో లేకుండా అధికారులు చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన భూములకు గతంలో అధికారులు పట్టాలు జారీ చేశారని, దీంతో రైతుబంధు డబ్బులు సైతం తీసుకున్నామని అన్నారు.

ఇప్పుడు తమ భూముల రికార్డులు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదనే కారణంగా పట్టా భూములపై వ్యవసాయ రుణాలతోపాటు రైతుబంధుకు అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు తమ గురించి పట్టించుకోవడంలేదని, తమ భూములు తమకు న్యాయపరంగా ఇవ్వకుంటే తామంతా కలిసే దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు వెల్లడించారు.

నరహంతక జంట: భర్త 8 హత్యలు చేస్తే భార్య అంతకుమించి..

 

Tags:    

Similar News