ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకుల అనుమతి?
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని ఎట్టకేలకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ చివరి నుంచి ఐపీఎల్ ఆడటానికి భారత ప్రభుత్వ అనుమతి కోరాలని కూడా అపెక్స్ కమిటీలో ప్రతిపాదించారు. అన్నీ సక్రమంగా జరిగితే దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీబీ జనరల్ మేనేజ్ ముబాషిర్ ఉస్మానీ తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే తప్పకుండా ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. […]
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని ఎట్టకేలకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ చివరి నుంచి ఐపీఎల్ ఆడటానికి భారత ప్రభుత్వ అనుమతి కోరాలని కూడా అపెక్స్ కమిటీలో ప్రతిపాదించారు. అన్నీ సక్రమంగా జరిగితే దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) కూడా ధ్రువీకరించింది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీబీ జనరల్ మేనేజ్ ముబాషిర్ ఉస్మానీ తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే తప్పకుండా ప్రేక్షకులను అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, ఈసీబీ చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. యూఏఈలో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నందున, భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉందన్నారు.