రవాణా శాఖకు ఫ్యాన్సీ ఆదాయం
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు తగ్గినా ఫ్యాన్సీ నెంబర్ల డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా రాష్ట్రంలో ఓ ఫ్యాన్సీ నంబర్ భారీ రేటు పలికింది. శుక్రవారం ఒక్కరోజే రవాణా శాఖకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో రూ. 31,48,487 ఆదాయం వచ్చింది. మూడు ఫ్యాన్సీ నెంబర్లకు అత్యధిక ధర పలికింది. టీఎస్ 09 ఎఫ్‌కే 9999 నెంబర్‌ను ఆర్ఎస్ బ్రదర్స్సంస్థ రూ. 9.14 లక్షలతో సొంతం చేసుకుంది. టీఎస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా కార్ల అమ్మకాలు తగ్గినా ఫ్యాన్సీ నెంబర్ల డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. తాజాగా రాష్ట్రంలో ఓ ఫ్యాన్సీ నంబర్ భారీ రేటు పలికింది. శుక్రవారం ఒక్కరోజే రవాణా శాఖకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో రూ. 31,48,487 ఆదాయం వచ్చింది. మూడు ఫ్యాన్సీ నెంబర్లకు అత్యధిక ధర పలికింది.
టీఎస్ 09 ఎఫ్‌కే 9999 నెంబర్‌ను ఆర్ఎస్ బ్రదర్స్సంస్థ రూ. 9.14 లక్షలతో సొంతం చేసుకుంది. టీఎస్ 09ఎఫ్ఆర్ 9999 నెంబర్‌ను ఓ వాహనదారుడు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నాడు. అదే విధంగా టీఎస్ 09 ఎఫ్ఎల్ 0001 నెంబర్‌ను లహరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 3.81 లక్షలు, టీఎస్ 09ఎఫ్ఎల్ 0099 నెంబర్‌ను అస్మిత పద్మనాభవన్ రూ. 3.33 లక్షలకు దక్కించుకున్నారు. మొత్తంగా 9999 నంబర్ మరోసారి రికార్డు ధరకు అమ్ముడైంది.
సాధారణంగా ఈ సంఖ్యకు చాలా పోటీ ఉంటుంది. లాక్‌డౌన్‌లో తొలిసారి ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్లపై ఒక్క రోజే ఆదాయం రూ.31 లక్షలు దాటింది.