సిద్ధిపేటకు చెందిన ప్రముఖ కవి కన్నుమూత

దిశ, సిద్దిపేట: ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యం మంత్రశాస్త్రంలో ప్రావీణ్యులు అయిన ఉమాపతి బాలాంజనేయశర్మ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 13 ఏండ్ల పిన్న వయసులోనే ఆదిశంకరాచార్యులు రచించిన దేవీ మానస పూజను తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులోనూ, ఇంగ్లీష్‌లోనూ ఆయన కవితా రచన సాగించారు. సిద్దిపేటకు చెందిన ఉమాపతి శర్మ ప్రారంభంలో కొంతకాలం సెక్రటేరియట్ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత అల్ ఇండియా రేడియో వివిధభారతి విభాగంలో వ్యాఖ్యాతగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన […]

Update: 2020-07-12 07:26 GMT

దిశ, సిద్దిపేట: ప్రముఖ కవి, నాటక రచయిత, రేడియో వ్యాఖ్యాత, జ్యోతిష్యం మంత్రశాస్త్రంలో ప్రావీణ్యులు అయిన ఉమాపతి బాలాంజనేయశర్మ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 13 ఏండ్ల పిన్న వయసులోనే ఆదిశంకరాచార్యులు రచించిన దేవీ మానస పూజను తెలుగులోకి అనువాదం చేశారు. తెలుగులోనూ, ఇంగ్లీష్‌లోనూ ఆయన కవితా రచన సాగించారు. సిద్దిపేటకు చెందిన ఉమాపతి శర్మ ప్రారంభంలో కొంతకాలం సెక్రటేరియట్ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత అల్ ఇండియా రేడియో వివిధభారతి విభాగంలో వ్యాఖ్యాతగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయన రాసిన భువన విజయం పద్య నాటకం జాతీయ స్థాయిలో దూరదర్శన్ ద్వారా ప్రసారమై ప్రశంసలు పొందింది. ఇంకా హంపీ సుందరి అనే పద్య నాటకంతో ఇతర పద్యకృతులు ‘‘blues and blossoms’’ అనే ఆంగ్ల కవితా సంకలనం వెలువరించారు. జ్యోతిష్యంలో ఎంతో పరిశోధన చేసిన ఉమాపతి శర్మ ఎంతో మంది ప్రముఖుల విశ్వాసాన్ని చూరగొన్నారు. ఆయన మృతి సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని లోటని అన్నారు.

Tags:    

Similar News