ఈ ఎస్.బి.ఐ. పక్కా నకిలీదే..
దిశ, వెబ్ డెస్క్ : నిత్య జీవితంలో ఎన్నో నకిలీ వస్తువులను చూస్తూ ఉంటాం. కానీ 20 ఏండ్లు కూడా నిండని ఈ యువకుడు పక్కా ప్లాన్ తో గీచిన స్కెచ్ ను అంత త్వరగా ఎవరు గుర్తించలేకపోయారు. అద్దాల నగిషీలతో కార్పొరేట్ స్థాయిలో ఓ నకిలీ బ్యాంక్ నే సృష్టించాడు. దాని హంగులు, అద్దాల చాంబర్లను చూస్తే ఏ ఒక్కరూ ఇది నకిలీది అనుకోరు. కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆ బ్యాంకును చూసి అధికారులకు […]
దిశ, వెబ్ డెస్క్ : నిత్య జీవితంలో ఎన్నో నకిలీ వస్తువులను చూస్తూ ఉంటాం. కానీ 20 ఏండ్లు కూడా నిండని ఈ యువకుడు పక్కా ప్లాన్ తో గీచిన స్కెచ్ ను అంత త్వరగా ఎవరు గుర్తించలేకపోయారు. అద్దాల నగిషీలతో కార్పొరేట్ స్థాయిలో ఓ నకిలీ బ్యాంక్ నే సృష్టించాడు. దాని హంగులు, అద్దాల చాంబర్లను చూస్తే ఏ ఒక్కరూ ఇది నకిలీది అనుకోరు. కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆ బ్యాంకును చూసి అధికారులకు సైతం నోటమాట రాలేదంటే అతడి పకడ్బందీ ప్లాన్ ఎలా ఉందో ఉహించవచ్చు. సినిమా స్టోరీని తలపించేలా మూడు నెలలపాటు సాగిన వారి కార్యకలాపాలు ఓ కస్టమర్ కు వచ్చిన అనుమానంతో తో వెలుగులోకి వచ్చింది.
తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన కమల్ బాబు తల్లిదండ్రులు ఎస్.బీ.ఐలో రిటైర్డ్ ఉద్యోగులు. తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా.. తల్లి రెండేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసింది. అయితే బ్యాంకింగ్ రంగం మీద అవగాహన ఉన్న కమల్ బాబు ఈజీగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్దితో రబ్బర్ స్టాంపులు తయారు చేసే మాణిక్యం, ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కుమార్ తో కలిసి పన్రూటిలో నకిలీ ఎస్బీఐ శాఖను ప్రారంభించాడు.
బ్యాంకు ప్రారంభం అనంతరం ఖాతాలు ఓపెన్ చేసేందుకు రంగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ ఖాతాదారుడు ఒకరు ఆ నూతన ఎస్బీఐ శాఖను చూశాడు. పన్రూటిలో అప్పటికే రెండు శాఖలు ఉండగా మరో శాఖ ప్రారంభం కావడంతో ఆ ఖాతాదారుడు తన బ్యాంక్ మేనేజర్ ను కలిసి వివరాలు అడిగాడు. ఆయన జోనల్ అధికారి సమాచారం ఇవ్వడంతో అది నకిలీ బ్యాంక్ గా బయటపడింది. అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో కలిసి నకిలీ బ్యాంక్ కు వెళ్లిన అధికారులు అక్కడి కార్పొరేట్ హంగులను చూసి అవాక్కైయ్యారు. కాగా అక్కడ ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో ఎవరికీ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ అంబేద్కర్ తెలిపారు.