స్పీకర్ కూతురు బ్యాక్ డోర్ నుంచి ఐఏఎస్ అయ్యారా?
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ కూతురు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లోక్ సభ స్పీకర్ కూతురు కాబట్టే ఆమె బ్యాక్ డోర్ నుంచి ఐఎస్ఎస్ అయ్యారంటూ వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఐఏఎస్…దేశంలో ఈ హోదాకు ఉండే ప్రతిష్ట చెప్పనక్కర్లేదు! యూపీఎస్సీ నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా సివిల్ సర్వీస్ లో విధులు నిర్వహించవచ్చు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షల్లో ఇటీవల ఉత్తీర్ణత […]
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభ స్పీకర్ కూతురు గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. లోక్ సభ స్పీకర్ కూతురు కాబట్టే ఆమె బ్యాక్ డోర్ నుంచి ఐఎస్ఎస్ అయ్యారంటూ వార్తలు రావడం కలకలం రేపుతోంది.
ఐఏఎస్…దేశంలో ఈ హోదాకు ఉండే ప్రతిష్ట చెప్పనక్కర్లేదు! యూపీఎస్సీ నిర్వహించే ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా సివిల్ సర్వీస్ లో విధులు నిర్వహించవచ్చు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షల్లో ఇటీవల ఉత్తీర్ణత సాధించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా బ్యాక్ డోర్ నుంచే ఈ పరీక్షల్లో విజయం సాధించారంటూ వార్తలు నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి.
2019లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బి వంటి కేంద్ర సర్వీసుల నియామకం కోసం మొత్తం 927 పోస్టులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మెరిట్ క్రమంలో తొలుత 829 మంది అభ్యర్థుల ఎంపికను ప్రకటించింది. రిజర్వ్ జాబితా నుండి వివిధ సివిల్ సర్వీసుల కోసం అంజలితో సహా 89 మంది అభ్యర్థులను జనవరి 5న ప్రకటించింది. ఆ 89 మంది అభ్యర్ధుల జాబితాలో అంజలి 67వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ఫలితాల విడుదలతో అంజలి బిర్లా భావోద్వేగానికి గురయ్యారు. దేశ ప్రజల పట్ల తన తండ్రి నిబద్ధతను ఎప్పుడూ చూస్తున్నా. అందుకే సమాజం కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో సివిల్ సర్వీసుల్లో చేరాలనుకున్నట్లు చెప్పారు.
అయితే తాజాగా అంజలి బిర్లా ఎంపిక పై ఓ ఫేక్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ వార్తపై అంజలి బిర్లా స్పందించారు. అవును సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ చదివి నాకే నవ్వొచ్చింది. రూమర్స్ ఎప్పుడూ ఫన్ గానే ఉంటాయని విన్నాను. కానీ ఈ న్యూస్ పరిధిని దాటి నిరాధారంగా, పిచ్చిగా ఉందన్నారు. అంతేకాదు తాను యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసింది. హాల్ టికెట్ తో పాటు సంబంధిత వివరాల్ని నేషనల్ మీడియాతో పంచుకున్నారు.
మూడు విధాలుగా యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారని, ఆ పరీక్షల్లో విజయం సాధిస్తే సివిల్ సర్వెంట్ గా అర్హత సాధిస్తారని చెప్పారు. యూపీఎస్పీ పరీక్ష కట్టుదిట్టంగా జరుగుతుంది. బ్యాక్ డోర్ నుంచి అర్హత సాధించడం సాధ్యం కాదన్నారు. అంతేకాదు యూపీఎస్సీ నిర్వహించే పరీక్షను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని కోరారు.
” మొదటి జాబితాలో నా పేరును కేవలం 8 మార్కులతో కోల్పోయాను. యూపీఎస్సీ కోసం ఎంతో కష్టపడ్డా. ఆ కష్టం విలువ తెలుసుకోకుండా ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం బాధగా ఉంది. రూమర్స్ వెలుగులోకి రావడంతో చాలా మంది అండగా నిలిచారు. వారందరికి నా ధన్యావాదాలు” తెలిపారు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చిన్న కుమార్తె అంజలి బిర్లా