బయట పీటర్.. లోపల నారాయణ.. ఆ స్కూల్‌లో ఏం జరుగుతోంది..?

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో అనుమతి లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ.. విద్యా శాఖ అధికారులు స్పందించడం లేదు. పేరుకు తనిఖీలు, విచారణలతో అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కండేయ కాలనీలో గతంలో నడిచిన పీటర్ హెయిన్స్ పాఠశాలలో గత కొన్ని నెలలుగా నారాయణ విద్యా సంస్థలను యాజమాన్యం నిర్వహిస్తుంది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేసినప్పటికీ.. అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హంగులు […]

Update: 2021-11-23 05:21 GMT

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీలో అనుమతి లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నప్పటికీ.. విద్యా శాఖ అధికారులు స్పందించడం లేదు. పేరుకు తనిఖీలు, విచారణలతో అధికారులు చర్యలు తీసుకోవడంలో కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కండేయ కాలనీలో గతంలో నడిచిన పీటర్ హెయిన్స్ పాఠశాలలో గత కొన్ని నెలలుగా నారాయణ విద్యా సంస్థలను యాజమాన్యం నిర్వహిస్తుంది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు చేసినప్పటికీ.. అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హంగులు ఆర్భాటాలతో అనుమతి లేకుండా కార్పొరేట్ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పుస్తకాలు, ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్న చర్యలు తీసుకున్న దాఖలాలే కనిపించడం లేదు. కేవలం నోటీసుల పేరుతో చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు శూన్యం..

రామగుండం ఎంఈఓ మార్కండేయ కాలనీలో నిర్వహిస్తున్న పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో విద్యార్థుల బెల్ట్, టైలతో పాటు నోట్ పుస్తకాలు నారాయణ పేరుతో దర్శనమిచ్చాయి. దీంతో దీనిపై ఎంఈఓను వివరణ కోరగా తనిఖీ చేసిన సమయంలో ఉన్న వాటి ఆధారంగా పెద్దపల్లి డీఈఓకి రిపోర్ట్‌ను అందజేస్తామని పేర్కొన్నారు.

పాఠశాలను సీజ్ చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటి..?

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అధికారులే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. కనీసం నియమ నిబంధనలు పాటించకుండా ఎటువంటి అనుమతి లేకుండా హంగులు ఆర్భాటాలతో బహిరంగంగా పాఠశాల నడుస్తున్నా.. ఇప్పటివరకు పాఠశాలను సీజ్ చేయకపోవడం వెనుక ఆంతర్యమేంటి అనే అనుమానాలు అందరిలోనూ కలిగిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలపై పలు విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలు పక్షాల బాధితులు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించిన తనిఖీల పేరుతో కాలయాపన చేస్తున్నారే కానీ చర్యలు తీసుకోవడం లేదని పలు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని పలు పక్షాల బాధ్యులు విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News