నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు
దిశ, వెబ్డెస్క్ : నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించే ముఠా గుట్టును అసోం రాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. రాష్ట్ర రాజధాని గువాహటిలోని డిస్పూర్ ప్రాంతంలో ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అపార్టుమెంటులో కొందరు వ్యక్తులు దొంగ నోట్లను ముద్రిస్తున్నారనే సమచారంతో క్రైంబ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. దీంతో అపార్టుమెంట్లో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇస్లాంపూర్, అహ్మద్పూర్ ప్రాంతాలకు చెందిన నిజాం ఉద్దీన్, హమీద్ అలీ, నజరుల్ హుసేన్, అఫ్జలూర్ రహమాన్లుగా […]
దిశ, వెబ్డెస్క్ : నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించే ముఠా గుట్టును అసోం రాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. రాష్ట్ర రాజధాని గువాహటిలోని డిస్పూర్ ప్రాంతంలో ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అపార్టుమెంటులో కొందరు వ్యక్తులు దొంగ నోట్లను ముద్రిస్తున్నారనే సమచారంతో క్రైంబ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. దీంతో అపార్టుమెంట్లో ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఇస్లాంపూర్, అహ్మద్పూర్ ప్రాంతాలకు చెందిన నిజాం ఉద్దీన్, హమీద్ అలీ, నజరుల్ హుసేన్, అఫ్జలూర్ రహమాన్లుగా గుర్తించారు. వారి నుంచి ప్రింటింగ్ మిషన్, ఏటీఎం కార్డులు,14 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.