టెస్టు క్రికెట్‌కు డుప్లెసిస్ రిటైర్‌మెంట్.. నెక్ట్స్ ఏంటి..?
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రీకా జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పొడవైన ఫార్మాట్ నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన డు ప్లెసిస్, రాబోయే రెండేళ్ళకు చిన్నదైన ఫార్మాట్(T-20) పై దృష్టి పెడుతానన్నాడు. ‘నా హృదయం స్పష్టంగా ఉంది, కొత్త అధ్యాయంలోకి వెళ్ళడానికి సరైన సమయమిది” అని డు ప్లెసిస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా జట్టుకు డు ప్లెసిస్ 2016 లో టెస్ట్ కెప్టెన్సీ […]
దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రీకా జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పొడవైన ఫార్మాట్ నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన డు ప్లెసిస్, రాబోయే రెండేళ్ళకు చిన్నదైన ఫార్మాట్(T-20) పై దృష్టి పెడుతానన్నాడు. ‘నా హృదయం స్పష్టంగా ఉంది, కొత్త అధ్యాయంలోకి వెళ్ళడానికి సరైన సమయమిది” అని డు ప్లెసిస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
సౌత్ ఆఫ్రికా జట్టుకు డు ప్లెసిస్ 2016 లో టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. గత జనవరిలో నాయకత్వాన్ని వదులుకోవడానికి ముందు వరకు 36 మ్యాచ్‌ల్లో జట్టుకు సారథ్యం వహించాడు. ఇదే సమయంలో శ్రీలంకపై 199 పరుగులు బాది.. టెస్టు ఫార్మాట్లో అత్యధిక స్కోరును నమోదు చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా తరఫున మొత్తం 69 టెస్టు మ్యాచులు ఆడిన డుప్లెసిస్ 40.03 బ్యాటింగ్ యావరేజ్‌తో 4163పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
“నేను దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతాను.. జట్టుకు కెప్టెన్ అవుతాను.. అని 15 సంవత్సరాల క్రితం ఎవరైనా నాకు చెప్పి ఉంటే, నేను వాటిని నమ్మను. నాకు లభించిన ఆశీర్వాదాలతో టెస్ట్ కెరీర్‌కు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ”అని డు ప్లెసిస్ పోస్ట్‌లో వెల్లడించాడు. “తరువాతి రెండేళ్ళు T-20పై దృష్టి పెడుతాను.. ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైనంత వరకు ఎక్కువ సిరీస్‌లు ఆడాలనుకుంటున్నాను.. అంటూ ఫాఫ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వన్డే క్రికెట్‌లో కూడా రాణిస్తానని చెబుతూనే.. ఎక్కువగా టీ-20పై దృష్టి పెడుతాను అంటూ డుప్లెసిస్ స్పష్టం చేశాడు. అయితే, టెస్టు క్రికెట్‌లో డు ప్లెసిస్ తనదైన ముద్ర వేశాడని.. అతడి స్థానాన్ని మరి ఏ ఆటగాడు కూడా భర్తీ చేయాలేరని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.