15 శాతం పెరిగిన వ్యవసాయ, ప్రాసెస్‌డ్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులు!

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో వ్యవసాయ, ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 14.7 శాతం పెరిగి రూ.86.63 వేల కోట్లకు చేరుకున్నాయి. బియ్యం, తాజా పండ్లు, కూరగాయలతో సహా పలు ఆహార ఉత్పత్తుల్లో గణనీయమైన వృద్ధి కారణంగానే ఈ పెరుగుదల నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య బియ్యం ఎగుమతి గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.35.47 వేల కోట్ల నుంచి రూ.39.26 వేల కోట్లకు పెరిగిందని […]

Update: 2021-11-19 07:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో వ్యవసాయ, ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతులు 14.7 శాతం పెరిగి రూ.86.63 వేల కోట్లకు చేరుకున్నాయి. బియ్యం, తాజా పండ్లు, కూరగాయలతో సహా పలు ఆహార ఉత్పత్తుల్లో గణనీయమైన వృద్ధి కారణంగానే ఈ పెరుగుదల నమోదైందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య బియ్యం ఎగుమతి గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.35.47 వేల కోట్ల నుంచి రూ.39.26 వేల కోట్లకు పెరిగిందని మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

సమీక్షించిన కాలంలో తాజా పండ్లు, కూరగాల ఎగుమతులు రూ.10.18 వేల కోట్ల నుంచి రూ.11.37 వేల కోట్లకు పెరిగాయి. మాంసం, పాలు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు 16.95 వేల కోట్లకు చేరుకున్నాయి. జీడిపప్పు ఎగుమతులు 29.2 శాతం పెరిగి రూ. 1,972 కోట్లుగా నమోదయ్యాయి. గతం కంటే మెరుగ్గా ఎగుమతులను నిర్వహించేందుకు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నామని వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తి ఎగుమతుల అభివృద్ధి విభాగం ఛైర్మన్ ఎం అంగముత్తు అన్నారు.

Tags:    

Similar News