కారులో పేలుడు పదార్థాలు పట్టివేత

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. బొమ్మలరామారం మండలం పెద్దపర్వాతపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ప్రవీణ్, రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మరో నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలోఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కాటన్ పెట్టెల్లో 3000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. బాల్​రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా […]

Update: 2020-06-12 09:46 GMT

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. బొమ్మలరామారం మండలం పెద్దపర్వాతపూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న ప్రవీణ్, రాజశేఖర్​ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు. మరో నిందితుడు భాస్కర్ రెడ్డి పరారీలోఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు కాటన్ పెట్టెల్లో 3000 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ చెప్పారు. బాల్​రెడ్డి అనే వ్యక్తి సిద్దిపేట జిల్లా తొగుట వద్ద మ్యాక్సయిన్ (పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాం) నిర్వహిస్తున్నారు. తన వద్ద భాస్కర్ రెడ్డిని డ్రైవర్​గా నియమించుకున్నాడు. బాల్​రెడ్డి అంకిరెడ్డిపల్లి వద్ద సాల్వో కంపెనీలో పేలుడు పదార్థాలను ఆన్ లైన్‌లో బుక్ చేశాడు. వాటిని తీసుకురావడానికి వెళ్లిన డ్రైవర్ భాస్కర్ రెడ్డి డీసీఎం వ్యాన్​లో రెండు కాటన్ల ఎలక్ట్రిక్ డిటోనేటర్లను ఉంచి, ఆ సమాచారాన్ని ప్రవీణ్, రాజశేఖర్​కు తెలిపాడు. వారు వచ్చి రెండు కాటన్ల డిటోనేటర్లను కారులో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Tags:    

Similar News