గుంటూరు జిల్లాలో పేలుడు కలకలం

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికుడు యాదగిరి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకొని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి.. కెమికల్ రియాక్షన్‌తోనే పేలుడు జరిగినట్లు స్పష్టం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పెయింట్ డబ్బాలను చెత్తలో పడేయడంతో ఈ ప్రమాదం చోటు […]

Update: 2020-10-04 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికుడు యాదగిరి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలుసుకొని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి.. కెమికల్ రియాక్షన్‌తోనే పేలుడు జరిగినట్లు స్పష్టం చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు పెయింట్ డబ్బాలను చెత్తలో పడేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు యాదగిరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Tags:    

Similar News