పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీం వివరాలివ్వండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీం వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. లబ్దిదారుల గుర్తింపు, ఈ పథకం అమలును పర్యవేక్షించే విధానం, ఇతర వివరాలను సమర్పించాలని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, అనిరుద్ధ బోస్‌ల ద్విసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అనాథాశ్రమంలో కరోనా కేసులు పెరిగిన ఉదంతాన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తున్న ధర్మాసనం, మహమ్మారి మూలంగా అనాథలైన పిల్లలను ఆదుకోవాలని కేంద్రం, రాష్ట్ర […]

Update: 2021-06-01 08:25 GMT

న్యూఢిల్లీ: కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కేర్స్ చిల్డ్రన్ స్కీం వివరాలను అందజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. లబ్దిదారుల గుర్తింపు, ఈ పథకం అమలును పర్యవేక్షించే విధానం, ఇతర వివరాలను సమర్పించాలని న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, అనిరుద్ధ బోస్‌ల ద్విసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అనాథాశ్రమంలో కరోనా కేసులు పెరిగిన ఉదంతాన్ని సుమోటోగా తీసుకుని విచారిస్తున్న ధర్మాసనం, మహమ్మారి మూలంగా అనాథలైన పిల్లలను ఆదుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఇది వరకే ఆదేశించిన సంగతి తెలిసిందే. అనాథల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల వివరాలను అమికస్ క్యూరీగా నియమించిన గౌరవ్ అగర్వాల్‌కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేయాలని, ఇందుకోసం నోడల్ అధికారులను నియమించుకోవాలని ఆదేశించింది. దీనిపై ఈ నెల 7న విచారణ కొనసాగించనుంది

Tags:    

Similar News