థ్రిల్లింగ్ కథనంతో ‘ఎక్స్‌పైరీ డేట్’
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఓటీటీ హవా రెట్టింపయ్యింది. సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లకే ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలో సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు పెద్దపీట వేస్తున్న జీ5.. మరో థ్రిల్లర్ కాన్సెప్ట్ ‘ఎక్స్‌పైరీ డేట్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. గురువారం పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్.. అక్టోబర్ 2 నుంచి సిరీస్ ప్రసారం కాబోతున్నట్లు తెలిపింది. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్‌పైరీ డేట్‌లో టోనీ లూక్, స్నేహా ఉల్లాల్, మధు షాలిని, అలీ రెజా […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఓటీటీ హవా రెట్టింపయ్యింది. సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లకే ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలో సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు పెద్దపీట వేస్తున్న జీ5.. మరో థ్రిల్లర్ కాన్సెప్ట్ ‘ఎక్స్‌పైరీ డేట్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది. గురువారం పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్.. అక్టోబర్ 2 నుంచి సిరీస్ ప్రసారం కాబోతున్నట్లు తెలిపింది.
శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎక్స్‌పైరీ డేట్‌లో టోనీ లూక్, స్నేహా ఉల్లాల్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ సిరీస్ నిర్మితమవుతోంది. ఇద్దరబ్బాయిల ప్రవర్తనలో వచ్చిన మార్పు ఎలాంటి మోసపూరిత, దుర్మార్గపు పనులు చేసేందుకు దారితీసింది? తద్వారా వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది కాన్సెప్ట్ కాగా.. ఇదొక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అని తెలిపారు హీరో టోనీ లూక్. రొమాన్స్, రివేంజ్‌తో కూడిన ఎక్స్‌పైరీ డేట్‌కు జీ5 గ్లోబల్ రీచ్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
కాగా, ఎక్స్‌పైరీ డేట్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంటర్ కాబోతున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్… యూనిక్ కాన్సెప్ట్‌తో ఎంటర్ కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ప్రతీ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఇస్తుందని.. తన పాత్ర ఇతరులను డామినేట్ చేసేలా ఉంటుందని తెలిపింది. ఇతరులను ఇబ్బంది పెట్టే పాత్రలో ప్రేక్షకులకు సరికొత్తగా కనిపిస్తానని వివరించింది.
ప్రేమ, మోసం, నమ్మకం, ప్రతీకారంతో కూడిన కథ ఊహించని మలుపులతో ఆడియన్స్‌కు ఉత్కంఠ కలిగిస్తుందన్నారు దర్శకుడు శంకర్ కె. మార్తాండ్. పది ఎపిసోడ్స్‌తో కూడిన సిరీస్.. అక్టోబర్ 2 నుంచి జీ5లో ప్రసారం కానుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సిరీస్‌కు మరింత ప్లస్ అయిందని తెలిపారు.