రోగులకు ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజెక్షన్స్.. ఇదేంటనీ అడిగితే..
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజెక్షన్ల కలకలం చోటుచేసుకుంది. కాలం చెల్లిన ఇంజక్షన్లను ఓ రోగి బంధువు గుర్తించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఆసుపత్రిలోని మూడో వార్డులో ఉన్న పేషెంట్లందరికీ వైద్య సిబ్బంది కాలం చెల్లిన యాంటి బయోటిక్ ఇంజక్షన్లను ఇచ్చారు. ఈ క్రమంలో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. వార్డులో 12 మందికి జనవరి నెలతో గడువు ముగిసిన ఇంజక్షన్లను ఇచ్చారని వారు ఆరోపించారు. ఇదేమిటని […]
దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన ఇంజెక్షన్ల కలకలం చోటుచేసుకుంది. కాలం చెల్లిన ఇంజక్షన్లను ఓ రోగి బంధువు గుర్తించడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఆసుపత్రిలోని మూడో వార్డులో ఉన్న పేషెంట్లందరికీ వైద్య సిబ్బంది కాలం చెల్లిన యాంటి బయోటిక్ ఇంజక్షన్లను ఇచ్చారు.
ఈ క్రమంలో రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. వార్డులో 12 మందికి జనవరి నెలతో గడువు ముగిసిన ఇంజక్షన్లను ఇచ్చారని వారు ఆరోపించారు. ఇదేమిటని షేషంట్స్ బంధువులు నిలదీయగా.. సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రోగి బంధువు ఒకరు మాట్లాడుతూ.. గడువు తీరిన ఇంజక్షన్ ఇవ్వడంతో తన భర్త స్పృహలో లేడని, ఎవ్వరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇంజక్షన్ల వ్యవహారంపై విచారణ చేపట్టినట్టు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.