ట్విట్టర్ సీఈవోగా భారతీయుడు.. మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఇటీవల సీఈవో బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పరాగ్ అగర్వాల్ ఆయన స్థానంలో ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే భారత సంతతికి చెందిన వ్యక్తులు మైక్రోసాఫ్ట్ సీఈవోగా […]

Update: 2021-11-30 00:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఇటీవల సీఈవో బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పరాగ్ అగర్వాల్ ఆయన స్థానంలో ట్విట్టర్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం. ఇప్పటికే భారత సంతతికి చెందిన వ్యక్తులు మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణలు కొనసాగుతుండగా, మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ట్విట్టర్‌కు సీఈఓ కావడం పట్ల ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News