ఎక్స్‌క్లూజివ్… నజ్రియా, ఫాహద్ ‘లవ్‌ స్టోరీ’

దిశ, సినిమా: మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తే గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పాడు హీరో ఫాహద్ ఫాజిల్. ఎప్పుడు ప్రైవేట్ పర్సన్‌గా ఉండేందుకు ఇష్టపడే హీరో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అసలు ఇంట్రెస్ట్ చూపించడు. కానీ నజ్రియాతో రిలేషన్‌షిప్, ఆమె తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాక అందుకున్న సక్సెస్ గురించి సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. ‘బెంగళూర్ డేస్’ షూటింగ్ సమయంలో తనకు హ్యాండ్ రిటర్న్ లెటర్, రింగ్ ఇచ్చి లవ్ […]

Update: 2021-06-17 03:25 GMT

దిశ, సినిమా: మనం కోరుకున్న వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశిస్తే గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పాడు హీరో ఫాహద్ ఫాజిల్. ఎప్పుడు ప్రైవేట్ పర్సన్‌గా ఉండేందుకు ఇష్టపడే హీరో.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అసలు ఇంట్రెస్ట్ చూపించడు. కానీ నజ్రియాతో రిలేషన్‌షిప్, ఆమె తన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యాక అందుకున్న సక్సెస్ గురించి సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు. ‘బెంగళూర్ డేస్’ షూటింగ్ సమయంలో తనకు హ్యాండ్ రిటర్న్ లెటర్, రింగ్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశానన్న హీరో.. దానికి తాను ఎస్ చెప్పలేదు అలా అని నో చెప్పలేదన్నాడు. ఆ టైమ్‌లో ‘బెంగళూరు డేస్‌’తో పాటు మరో రెండు సినిమా షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నానని, ఒకేసారి మూడు సినిమాలు చేయడం ఆత్మహత్య చేసుకున్నట్లు అనిపించిందని తెలిపాడు. ఎప్పుడెప్పుడు నజ్రియాను చూడాలా? తనతో కలిసి ‘బెంగళూరు డేస్’ షూటింగ్‌కు అటెండ్ కావాలా అని వెయిట్ చేసినట్లు చెప్పాడు.

నజ్రియా చుట్టూ ఉండటం అంటే తనకు ఇష్టమన్న ఫాహద్.. కానీ తన ఆలోచనలు రాండమ్‌గా ఉండేవని తెలిపాడు. అయితే నజ్రియా తనను వదులుకోవాల్సిన పరిస్థితి రావడంతో భయంతో ఫ్లక్చువేట్ అయిపోయానని చెప్పాడు. ఇక ఇదంతా వర్కౌట్ కాదని అనుకుంటున్నప్పుడు.. ‘హలో, మెథడ్ యాక్టర్, మీరు ఎవరు అనుకుంటున్నారు? ఇది జస్ట్ వన్ సింపుల్ లైఫ్. ప్యాక్ యువర్ బ్యాగ్స్’ అంటూ తనకు ఓకే చెప్పిందని తెలిపాడు.

ఇప్పుడు కూడా తాను బాత్రూమ్‌లో రిమోట్ మరిచిపోతే.. హలో మీరు ఎవరు అనుకుంటున్నారు? అని సేమ్ క్వశ్చన్ అడుగుతుందన్న ఫాహిద్.. ఏడేళ్లు పూర్తి చేసుకున్న ‘బెంగళూర్ డేస్’ సినిమా నజ్రియా రూపంలో తనకు అర్హతను మించిన ఆనందం, అదృష్టాన్ని ఇచ్చిందని తెలిపాడు. ‘మ్యాటర్ ఏదైనా సరే మేమిద్దరం ఒక టీమ్.. ఒకటిగా పనిచేస్తాం.. ఒకరినొకరం స్పాయిల్ చేసుకుంటాం.. ఒకరికోసం ఒకరం నిలబడతాం..’ అని ఫాహద్ ఫాజిల్ చెప్పిన ఈ స్టోరీ నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

Tags:    

Similar News