మళ్లీ వేట ఆరంభం.. ఆందోళనలో జనం
దిశ, కాటారం: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆ ప్రాంతంలో అగంతకులు మళ్లీ నిధుల కోసం వేట ప్రారంభించారు. గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి తవ్వకాలు జరిపారు. ఇందుకోసం జంతువులను కూడా బలిస్తూ తవ్వకాలు జరుపుతున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం సూరారం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి అగంతకులు గ్రామ దేవతలను పెకిలించి తవ్వకాలు జరిపారు. గత బుధవారం గ్రామ కూడలిలో మేకలు బలి ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి విగ్రహాన్ని, బొడ్రాయిని […]
దిశ, కాటారం: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఆ ప్రాంతంలో అగంతకులు మళ్లీ నిధుల కోసం వేట ప్రారంభించారు. గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రి తవ్వకాలు జరిపారు. ఇందుకోసం జంతువులను కూడా బలిస్తూ తవ్వకాలు జరుపుతున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం సూరారం గ్రామంలో ఆదివారం అర్థరాత్రి అగంతకులు గ్రామ దేవతలను పెకిలించి తవ్వకాలు జరిపారు. గత బుధవారం గ్రామ కూడలిలో మేకలు బలి ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లి విగ్రహాన్ని, బొడ్రాయిని తొలగించి తవ్వకాలు జరిపి అదే స్థానంలో విగ్రహాలను పెట్టి పరారయ్యారు. దీంతో ఆ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.