భారత్‌లో 'జిమ్నీ' మోడల్ విడుదలపై ఫీడ్‌బ్యాక్ పరిశీలిస్తున్నాం: మారుతి సుజుకి!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసే ప్రణాళికలో భాగంగా జిమ్నీ మోడల్ గురించి పరిశీలిస్తున్నట్టు తెలిపింది. భారత్‌లో ఈ మోడల్‌ను తీసుకొచ్చేందుకు కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మూడు డోర్ల ఈ మోడల్ కారును గురుగ్రామ్‌లో తయారు చేస్తున్నామని, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని వివరించింది. ఈ వాహనం పరిమాణంలో కాంపాక్ట్ మోడల్ అయినప్పటికీ ఆఫ్‌రోడ్ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేసే ప్రణాళికలో భాగంగా జిమ్నీ మోడల్ గురించి పరిశీలిస్తున్నట్టు తెలిపింది. భారత్‌లో ఈ మోడల్‌ను తీసుకొచ్చేందుకు కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను ఆశిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మూడు డోర్ల ఈ మోడల్ కారును గురుగ్రామ్‌లో తయారు చేస్తున్నామని, మిడిల్ఈస్ట్, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని వివరించింది.
ఈ వాహనం పరిమాణంలో కాంపాక్ట్ మోడల్ అయినప్పటికీ ఆఫ్‌రోడ్ ప్రయాణానికి ఎంతో వీలుగా ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో 50 ఏళ్ల నుంచి జిమ్నీ మోడల్ ఉంది. అయితే, వినియోగదారులకు ఇది ఎంతమేరకు ఆకట్టుకుంటుందో పరిశీలిస్తున్నాం. దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై సమీక్ష నిర్వహిస్తున్నామని మారుతి సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు ధరల నుంచి విడిభాగాల సరఫరా సహా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కోవిడ్-19 వల్ల కొత్త మోడళ్లను తీసుకురావడంలో ఆలస్యమవుతోంది. గత కొంతకాలంగా పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని భావిస్తున్నామని’ శశాంక్ వెల్లడించారు.