అలర్ట్.. సింగరేణిలో ఉద్యోగానికి ఆగస్టులో పరీక్ష

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఫిట్టర్ ట్రెయినీ (ఎక్స్‌ట‌ర్నల్‌) క్యాట‌గిరీ-1 ప‌రీక్ష ఆగ‌స్టు 8వ తేదీన జ‌ర‌గ‌నుందని జి.ఎం. పర్సనల్ (ఆర్.సి.ఐ.ఆర్. & పి.ఎం.) ఎ.ఆనందరావు తెలిపారు. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులు మ‌ళ్లీ హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గ‌తంలో ఏప్రిల్ 25వ తేదీన ప‌రీక్ష నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు చేసి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, అయితే లాక్‌డౌన్‌, క‌రోనా […]

Update: 2021-07-31 07:57 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డిన ఫిట్టర్ ట్రెయినీ (ఎక్స్‌ట‌ర్నల్‌) క్యాట‌గిరీ-1 ప‌రీక్ష ఆగ‌స్టు 8వ తేదీన జ‌ర‌గ‌నుందని జి.ఎం. పర్సనల్ (ఆర్.సి.ఐ.ఆర్. & పి.ఎం.) ఎ.ఆనందరావు తెలిపారు. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులు మ‌ళ్లీ హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గ‌తంలో ఏప్రిల్ 25వ తేదీన ప‌రీక్ష నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు చేసి హాల్ టికెట్లను అందుబాటులో ఉంచింది. చాలామంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని, అయితే లాక్‌డౌన్‌, క‌రోనా ఉధృతి నేప‌థ్యంలో ప‌రీక్షను వాయిదా వేసినట్లు వివరించారు.

క‌రోనా నిబంధ‌న‌లు స‌డ‌లించ‌డంతో పాటు ఆగ‌స్టు 8వ తేదీన ప‌రీక్ష నిర్వహ‌ణ‌కు ఏర్పాట్లు చేసి హాల్ టికెట్లను www.scclmines.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు కొత్తగా హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకొని ప‌రీక్షకు హాజ‌రు కావాలని సూచించారు. తాజాగా డౌన్ లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లలో పరీక్ష కేంద్రాల మార్పు వివరాలను కూడా చూసుకోవాలని ఈ సందర్భంగా అభ్యర్థులని కోరారు.

Tags:    

Similar News