హెడ్ కోచ్ బెదాడే సస్పెన్షన్
భారత మాజీ క్రికెటర్, బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే (53)పై బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. బెదాడేకు సస్పెన్షన్ తెలియజేసేందుకు లేఖ రాసిన బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె.. ఆ లేఖలో మహిళా జట్టు క్రికెటర్లు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు గురించి వివరించారు. మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల […]
భారత మాజీ క్రికెటర్, బరోడా మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న అతుల్ బెదాడే (53)పై బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. బెదాడేకు సస్పెన్షన్ తెలియజేసేందుకు లేఖ రాసిన బీసీఏ కార్యదర్శి అజిత్ లెలె.. ఆ లేఖలో మహిళా జట్టు క్రికెటర్లు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు గురించి వివరించారు.
మహిళా క్రికెటర్ల శారీరక విషయాల గురించి, వారి ఆరోగ్య విషయాల గురించి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర భాష మాట్లాడటం, లైంగికపరమైన అంశాల గురించి కూడా చర్చించే ప్రయత్నం చేయడం వంటి కారణాలతో అతనిని సస్పెండ్ చేస్తున్నట్టు వివరించారు.
సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని, క్రికెటర్లను విచారించిన తరువాత జరిపిన విచారణలో పలు విషయాలు బయటపడ్డాయని, అందుకే సస్పెన్షన్ వేటు వేశామని వెల్లడించారు. అయితే సస్పెన్షన్‌తోనే వివాదం సద్దమణగదని, పూర్తి స్థాయి విచారణ తరువాతే చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Tags: cricketer, atul bedade, bca head coach, baroda cricket association, harassment