జూడాల సమ్మెకు ఈటల సపోర్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి పూర్తిగా పోకముందే రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం భావ్యం కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని సమ్మెపై పునరాలోచించాలని డాక్టర్లను కోరారు. కరోనా కష్ట కాలంలో డాక్టర్లు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు. వైద్యో నారాయణో హరిః అనే సామెతను కరోనా నిజం […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా మహమ్మారి పూర్తిగా పోకముందే రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం భావ్యం కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని సమ్మెపై పునరాలోచించాలని డాక్టర్లను కోరారు. కరోనా కష్ట కాలంలో డాక్టర్లు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు.
వైద్యో నారాయణో హరిః అనే సామెతను కరోనా నిజం చేసి చూపించిందన్నారు. అలాంటి డాక్టర్స్ , సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెంచిన స్టైఫండ్ వెంటనే అందించి సమ్మె విరమింపజేసేలా చూడాలన్నారు. తాను ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్నంతకాలం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే స్పందించి వారితో చర్చలు జరపడం వల్ల పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడ్డామని, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.