ఓటర్లకు షాక్.. 'జై కేసీఆర్.. కారు గుర్తుకే మన ఓటు' అంటున్న ఈటల?
దిశ, వెబ్ డెస్క్: ఈ మాట వినగానే అందరూ షాకవుతున్నారు కదా?. అవునూ.. మీకు అసలు విషయం తెలిస్తే… అవును కదా అంటారు. అదేమిటంటే.. సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ కు సంబంధించిన ఓ ఫొటో తెగ వైరలవుతోంది. ఆ ఫొటోను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఈటల.. డప్పు కొట్టి మరీ నువ్వే చెబుతున్నావ్ కదా.. ‘జై కేసీఆర్.. కారు గుర్తుకే మన ఓటు’ అని అంటున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ […]
దిశ, వెబ్ డెస్క్: ఈ మాట వినగానే అందరూ షాకవుతున్నారు కదా?. అవునూ.. మీకు అసలు విషయం తెలిస్తే… అవును కదా అంటారు. అదేమిటంటే.. సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ కు సంబంధించిన ఓ ఫొటో తెగ వైరలవుతోంది. ఆ ఫొటోను టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఈటల.. డప్పు కొట్టి మరీ నువ్వే చెబుతున్నావ్ కదా.. ‘జై కేసీఆర్.. కారు గుర్తుకే మన ఓటు’ అని అంటున్నారు.
హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ చోట ఈటలకు మద్దతుగా ఆయన అభిమానులు డప్పులు కొట్టారు. అనంతరం వారు ఓ డప్పును ఈటల చేతికిచ్చి ఓ దరువేసి అక్కడున్నవారందరినీ ఉత్తేజపరచాల్సిందిగా కోరారు. దీంతో ఈటల దరువేసి వారందరినీ ఉత్తేజపరిచారు. అయితే, ఈటల దరువు వేసిన డప్పుపై ‘జై కేసీఆర్.. కారు గుర్తుకే మన ఓటు’ అని రాసి ఉంది. ఇది గమనించిన టీఆర్ఎస్ అభిమానులు అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోను వైరల్ చేస్తూ ‘ఇప్పుడు కొట్టండి రా డప్పులు… టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేస్తున్న ఈటల గారికి ధన్యవాదాలు.. టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానానికి జోహార్లు. జై టీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై హరీష్ అన్న’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై ఈటల రాజేందర్, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.