స్వగ్రామంలో గెల్లుకు షాకిచ్చిన ఈటల రాజేందర్
దిశ, వీణవంక: హుజురాబాద్ ఉప ఎన్నికలో ఫస్ట్ రౌండ్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యత కనబరిచిన గెల్లు, ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ పూర్తైనా ఈటలకు పోటీ ఇవ్వలేకపోతున్నాడు. కచ్చితంగా ఆధిక్యం సాధిస్తామనుకున్న గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించడం టీఆర్ఎస్ కేడర్‌ను ఆందోళనలో పడేసింది. ఇప్పటికే అత్తగారి ఊర్లో అనూహ్య షాక్ తిన్న గెల్లుకు మరో బిగ్ షాక్ తగిలింది. గెల్లు […]
దిశ, వీణవంక: హుజురాబాద్ ఉప ఎన్నికలో ఫస్ట్ రౌండ్ నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతోంది. పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యత కనబరిచిన గెల్లు, ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ పూర్తైనా ఈటలకు పోటీ ఇవ్వలేకపోతున్నాడు. కచ్చితంగా ఆధిక్యం సాధిస్తామనుకున్న గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లీడ్ సాధించడం టీఆర్ఎస్ కేడర్‌ను ఆందోళనలో పడేసింది. ఇప్పటికే అత్తగారి ఊర్లో అనూహ్య షాక్ తిన్న గెల్లుకు మరో బిగ్ షాక్ తగిలింది. గెల్లు శ్రీనివాస్ సొంత గ్రామమైన హిమ్మత్ నగర్‌లోనూ ఈటల రాజేందర్ ఆధిక్యత కనబర్చుతూ మరో దెబ్బ కొట్టారు. ఆయన కుటుంబానికి మంచి పట్టున్న గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం రావడం చర్చనీయాశంగా మారింది.