ఆ పని పూర్తయ్యేవరకు కేసీఆర్ వెంటపడుతా: ఈటల రాజేందర్
దిశ ప్రతినిధి, వరంగల్/కమలాపూర్: దళితబంధు అమలు చేసేంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటపడుతానంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, లక్ష్మీపూర్, వంగపల్లి, పంగిడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై ఘాటు వాఖ్యలు చేశారు. దళితబంధు ఆపివేయడం వెనుక కేసీఆర్ ట్రిక్స్ ఉన్నాయంటూ ఆరోపించారు. ఒక్క ఈటల రాజీనామాతో నా దళిత బిడ్డలకు రూ. 2500 కోట్లు ఇచ్చేందుకు […]
దిశ ప్రతినిధి, వరంగల్/కమలాపూర్: దళితబంధు అమలు చేసేంతవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటపడుతానంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి, మర్రిపల్లిగూడెం, లక్ష్మీపూర్, వంగపల్లి, పంగిడిపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై ఘాటు వాఖ్యలు చేశారు. దళితబంధు ఆపివేయడం వెనుక కేసీఆర్ ట్రిక్స్ ఉన్నాయంటూ ఆరోపించారు.
ఒక్క ఈటల రాజీనామాతో నా దళిత బిడ్డలకు రూ. 2500 కోట్లు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. దళితబంధు పథకం ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆరోపించారు. జమ్మికుంట గడ్డపై ప్రారంభించిన దళితబంధు చెక్కులకు ఇంకా డబ్బలు పడకపోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
కేసీఆర్.. చెల్పూర్ పోచమ్మగుడిలోకి తడిబట్టలతో పోదాం
ఎన్నికలకు సరిగ్గా వారం రోజులే సమయం ఉన్న నేపథ్యంలో దళితబంధును తాను అడ్డుకున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఈటల వ్యాఖ్యానించారు. దళితబంధు నిలిపివేతపై తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. అవసరమనుకుంటే చెల్పూర్ పోచమ్మగుడిలోకి తడిబట్టలు, పసుపు రాసుకుని వెళ్దామని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.