కేటీఆర్ కోసమే ఈటలను తొలగించారు.. జమున సంచలన వ్యాఖ్యలు
దిశ, వీణవంక: ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటూ ఈటల జమున అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఈటల రాజేందర్ నా కుడి భుజం అని, నా సొంత తమ్ముడు, హుజూరాబాద్ ప్రజలకు ఇంత గొప్ప నాయకుడు దొరకడం వాళ్ల అదృష్టమని చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అదే కేసీఆర్ తడి బట్టతో గొంతుకోశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి […]
దిశ, వీణవంక: ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటూ ఈటల జమున అన్నారు. గత సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఈటల రాజేందర్ నా కుడి భుజం అని, నా సొంత తమ్ముడు, హుజూరాబాద్ ప్రజలకు ఇంత గొప్ప నాయకుడు దొరకడం వాళ్ల అదృష్టమని చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు అదే కేసీఆర్ తడి బట్టతో గొంతుకోశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెసులోకి ఆహ్వానించి మంత్రి పదవి ఇస్తానని చెప్పినా.. ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని, పదవులు అవసరం లేదని తిరస్కరించారని చెప్పారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్.. ఈటల రాజేందర్‌ని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కానీ, హుజూరాబాద్ ప్రజలు ధర్మం, న్యాయం వైపు ఉన్నారని ఈటల రాజేందర్‌ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఆదిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.