ముగిసిన ప‌ద్మావ‌తి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

దిశ, ఏపీ బ్యూరో: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో 10రోజుల పాటు జ‌రిగిన నవరాత్రి ఉత్సవాలు సోమ‌వారం ముగిశాయి. కొవిడ్‌-19 నిబంధ‌ల కార‌ణంగా ఈ ఉత్సవాలను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివ‌రి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనం‌తో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి గజ వాహనసేవ ఏకాంతంగా జ‌రిగింది. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, […]

Update: 2020-10-26 12:24 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో 10రోజుల పాటు జ‌రిగిన నవరాత్రి ఉత్సవాలు సోమ‌వారం ముగిశాయి. కొవిడ్‌-19 నిబంధ‌ల కార‌ణంగా ఈ ఉత్సవాలను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివ‌రి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మ‌ధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనం‌తో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి గజ వాహనసేవ ఏకాంతంగా జ‌రిగింది. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ కుమార్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ రాజేష్ క‌న్నా, వాహ‌నం ఇన్‌స్పెక్టర్ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News