చత్తీస్‌ఘర్‌లో భారీ ఎన్‌కౌంటర్!

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘర్‌ చింతాగుఫా ప్రాంతంలోని కల్సాపద్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది సైనికులు మృతిచెందారు. వీరిలో 12 మంది డీఆర్‌జీ, 5 మంది ఎస్‌టీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వద్ద ఉన్నటువంటి ఆయుధాలను నక్సలైట్లు దోచుకెళ్లారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఈ ఘటనను ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లకు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాంక్షన్‌కు చెందిన భద్రతా సిబ్బంది మధ్య […]

Update: 2020-03-22 06:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘర్‌ చింతాగుఫా ప్రాంతంలోని కల్సాపద్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 17 మంది సైనికులు మృతిచెందారు. వీరిలో 12 మంది డీఆర్‌జీ, 5 మంది ఎస్‌టీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వద్ద ఉన్నటువంటి ఆయుధాలను నక్సలైట్లు దోచుకెళ్లారు. బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ఈ ఘటనను ధృవీకరించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్లకు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాంక్షన్‌కు చెందిన భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. మరో 13 మంది పోలీసుల ఆచూకీ తెలియలేదు. గాయపడ్డ పోలీసులను రాయపూర్ ఆసుపత్రికి తరలించారు. ఎన్‌కౌంటర్ జరిగిన పరిసర ప్రాంతల్లో మరింత పగడ్బందీగా భద్రతా సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.

Tags: encounter, chhattisgarh, encounter in chhattisgarh

Tags:    

Similar News