భ‌ద్రాద్రి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

దిశ , ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం-ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో బుధ‌వారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మొదటిసారి కాల్పుల నుంచి తప్పించుకున్న నక్సల్స్‌ను పోలీసు బృందాలు వెతుక్కుంటూ వెళ్లాయి. సరిగ్గా అదే సమయంలో మావోలు పోలీసులపై కాల్పులు జ‌రిపారు. ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ ప్రాంతంలో మణుగూరు మల్లెపల్లి తోగు అటవీప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య ఎన్ […]

Update: 2020-07-15 07:33 GMT

దిశ , ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం-ఆళ్లపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతంలో బుధ‌వారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. మొదటిసారి కాల్పుల నుంచి తప్పించుకున్న నక్సల్స్‌ను పోలీసు బృందాలు వెతుక్కుంటూ వెళ్లాయి. సరిగ్గా అదే సమయంలో మావోలు పోలీసులపై కాల్పులు జ‌రిపారు. ఈ ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోకివెళితే.. బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌ ప్రాంతంలో మణుగూరు మల్లెపల్లి తోగు అటవీప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. మావోల సంచారాన్ని గుర్తించిన పోలీసులు ముందుగా వారిపై కాల్పులు జరిపారు. అయితే, చాకచక్యంగా తప్పించుకున్న మావోలు క‌ర‌క‌గూడెం-ఆళ్లప‌ల్లి మండ‌లాల మ‌ధ్య ఉన్న అట‌వీ ప్రాంతలో వారు తలదాచుకున్నారు. ఈ సమాచారంతో మళ్లీ బ‌లగాలు రంగంలోకి దిగాయి. ఈక్ర‌మంలోనే కూంబింగ్ నిర్వ‌హిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసుల పై మావోలు ఎదురు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ మోచేతికి గాయం కాగా.. మావోల వైపు ప్రాణన‌ష్టం జ‌రిగిన‌ట్లుగా పోలీస్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అయితే దీనిపై ఉన్నతాధికారులు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. తుపాకుల మోత‌తో అట‌వీపై ఆధారపడి బ‌తుకుతున్న ఆదివాసీ, గిరిజ‌న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Tags:    

Similar News