ఖ‌మ్మం జిల్లాకు మూడో స్థానం దక్కింది

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో ఊరూరా ఉపాధి హామీ ప‌నుల జాత‌ర సాగుతోన్నది. కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో ఓ వైపు ఉన్న అసంఘటిత రంగాల్లో ఉన్న వారి ఉపాధి కోల్పోవడం, మరో వైపు వ్యవసాయ పనులు ముగియడంతో జనం ఉపాధి పనులకు ఉదయాన్నే తరలివెళ్తున్నారు. కందకాలు తవ్వడం, సైడ్‌ కాల్వలు, ఫాం పాండ్స్, పొలాల గట్లు చదును చేయడం, రోడ్లు వేయడం, మిషన్‌ కాకతీయ వంటి పనులు చేపడుతున్నారు. ఎక్కువ‌గా చెరువులు, కుంట‌ల్లో పూడిక‌తీత ప‌నులు కొన‌సాగుతున్నాయి. […]

Update: 2020-05-19 22:44 GMT

దిశ‌, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లాలో ఊరూరా ఉపాధి హామీ ప‌నుల జాత‌ర సాగుతోన్నది. కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో ఓ వైపు ఉన్న అసంఘటిత రంగాల్లో ఉన్న వారి ఉపాధి కోల్పోవడం, మరో వైపు వ్యవసాయ పనులు ముగియడంతో జనం ఉపాధి పనులకు ఉదయాన్నే తరలివెళ్తున్నారు. కందకాలు తవ్వడం, సైడ్‌ కాల్వలు, ఫాం పాండ్స్, పొలాల గట్లు చదును చేయడం, రోడ్లు వేయడం, మిషన్‌ కాకతీయ వంటి పనులు చేపడుతున్నారు. ఎక్కువ‌గా చెరువులు, కుంట‌ల్లో పూడిక‌తీత ప‌నులు కొన‌సాగుతున్నాయి. ఈ ఏడాది కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిదినాలు పెంచింది. దాంతో ఒకే కుటుంబంలో ఇద్దరి నుంచి నలుగురి వరకు పనులకు వెళ్తున్నారు. జిల్లాకు రాష్ట్రంలో మూడో స్థానం దక్కింది. జాబ్‌కార్డు ఉండి ఉపాధి పనికి అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

గతేడాది ప్రథమ స్థానం

జిల్లాలో 1.35 లక్షల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉపాధి పనులు ముగిసేసరికి కూలీలకు మరిన్ని రోజుల పనిదినాలు కల్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హరితహారం, ఇంకుడుగుంత‌ల కార్యక్రమాలతో పనిదినాలు పెంచేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోన్నది. గ‌తేడాది అత్య‌ధిక మందికి ఎక్కువ ప‌నిదినాలు క‌ల్పించిన జిల్లాగా ఖ‌మ్మం రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని ద‌క్కించుకుంది. కరోనా ఎఫెక్ట్ జిల్లాపై పడిందనీ, అయినా పనులు లక్ష్యాన్ని చేరుకునేలా సాగుతున్నాయని అధికారులు అంటున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే ఈసారి పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

కబనబడుటలేదు..

ప‌నుల‌కు కూలీల నుంచి స్పంద‌న బాగానే ఉన్నా స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో ఈజీఎస్ సిబ్బంది విఫ‌ల‌మ‌వుతున్నార‌నే చెప్పాలి. ప్ర‌తి గ్రామంలో ప‌నులు కొన‌సాగుతున్న ప్ర‌దేశాల్లో దాదాపు 150 మందికి పైగా ఉంటున్నారు. వారికి కావాల్సిన తాగునీరు, టెట్ల ఏర్పాటు, మెడిక‌ల్ కిట్లు కనబడుటలేదు. ఎండ‌కు తాళ‌లేక వృద్ధులు, మ‌హిళ‌లు కుప్ప‌కూలిపోతున్న ఘ‌ట‌న‌లు ఉంటున్నాయి. అంతేగాకుండా కరోనా నుంచి రక్షణకు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవడంలో సిబ్బంది విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News