సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏసీబీ రైడ్స్.. ఇద్దరు అవినీతి అధికారులకు ఊహించని షాక్

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో భూమి సర్వే రిపోర్టులను అందించేందుకు ఓ మహిళ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోమవారం మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో.. ఇన్‌స్పెక్టర్లు రమేష్ , వెంకట రాజా గౌడ్‌లు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా […]

Update: 2021-11-01 10:06 GMT

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో భూమి సర్వే రిపోర్టులను అందించేందుకు ఓ మహిళ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ సోమవారం మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో.. ఇన్‌స్పెక్టర్లు రమేష్ , వెంకట రాజా గౌడ్‌లు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగులు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

నందిగామ గ్రామానికి చెందిన ఓ మహిళ ఒక ఎకరం 19 గుంటల భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకుని జిల్లా కేంద్రంలోని అధికారులను, ఉద్యోగులను కలిశారు. దరఖాస్తుతో పాటు సర్వే కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమయ్యే చలాన్ కూడా కట్టారు. ఈ మేరకు అధికారులు సర్వేను పూర్తి చేసినప్పటికీ రిపోర్ట్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేశారు. చివరకు రిపోర్ట్‌ను అందించడానికి జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్, ఏ.డీకి చేరో రూ. పదివేల రూపాయలు మొత్తం 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అసిస్టెంట్ డైరెక్టర్‌ను కలవగా అతను కూడా రూ. 20 వేలు ఇవ్వాల్సిందే అనడంతో బాధితురాలు ఏసీబీని కలిసి వివరాలను తెలియజేశారన్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని విచారణలో భాగంగా సోమవారం తనిఖీలు చేపట్టగా లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్, జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్‌లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

Tags:    

Similar News