ఈటలకు ‘హుజురాబాద్’లో ఊహించని షాక్..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన పేరిట ఓ బాధిత సంఘం ఏర్పాటైంది. తిప్పారపు సంపత్ నేతృత్వంలో ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం ఆవిర్భవించింది. ఈ క్రమంలో మొదటి సమావేశానికి 17 బాధిత కుటుంబాలు హాజరయ్యాయి. ఈ సంఘంలో ఈటల రాజేందర్.. కారణంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారందరినీ చేర్పించుకుంటామని సంపత్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మరో చిక్కు వచ్చి పడింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయన పేరిట ఓ బాధిత సంఘం ఏర్పాటైంది. తిప్పారపు సంపత్ నేతృత్వంలో ఈటల రాజేందర్ దళిత బాధిత సంఘం ఆవిర్భవించింది. ఈ క్రమంలో మొదటి సమావేశానికి 17 బాధిత కుటుంబాలు హాజరయ్యాయి.
ఈ సంఘంలో ఈటల రాజేందర్.. కారణంగా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న వారందరినీ చేర్పించుకుంటామని సంపత్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమిటీలు వేసేందుకు ఈ సంఘం సమావేశం నిర్ణయించింది. అన్ని మండలాలకు చెందిన బాధితులంతా కలిసి త్వరలో జీపు జాత కార్యక్రమం చేపట్టనున్నారు. వీరంతా గ్రామ గ్రామాన తిరుగుతూ ఈటల కారణంగా తాము ఎన్ని కష్టాలు పడ్డామో వివరించనున్నారు.