ముందు తెలియదా?: ప్రభుత్వంపై బొత్స ఫైర్

ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2025-01-10 12:32 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట(Stampede)లో ఆరుగురు భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Mlc Bosta Satyanarayana) స్పందించారు. తొక్కిసలాట ఘటన బాధాకరమన్న ఆయన ప్రభుత్వంపై విరుచుపడ్డారు. అంతేకాదు ఘటనపై హైకోర్టు(Hicout) సుమోటోగా స్వీకరించాలన్నారు. అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఘటనపై బాధ్యత ఎవరిదంటూ నిలదీసిన బొత్స.. పరామర్శకు వెళ్లిన జగన్‌ను విమర్శిస్తారా అని బొత్స మండిపడ్డారు. 

తిరుపతి తొక్కిసలాట ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదని బొత్స ఆరోపించారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనన్నారు. భక్తులు భారీగా వస్తారని ముందే తెలిసినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెబితే సరిపోతుందా? అని నిలదీశారు. తొక్కిసలాట ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారన్నారు. సామాన్యుల ప్రాణాలంటే సర్కార్‌కు ఇంత నిర్లక్ష్యమా  అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News