స్వదేశీ బ్రాండ్‌లకు విపరీతమైన డిమాండ్ : మోహన్ గోయెంకా!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం కారణంగా ఎక్కువమంది భారతీయ వినియోగదారులు స్వదేశీ బ్రాండ్‌లవైపు మొగ్గుచూపుతున్నారని దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ ఇమామీ లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఇంటి అవసరాల కోసం పరిశుభ్రత ఉత్పత్తులకు ఆదరణ పెరిగిందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం హిందూస్తాన్ యూనిలీవర్ వంటి బహుళజాతి సంస్థలు ఇంటి పరిశుభ్రత ఉత్పత్తుల విభాగంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. భవిష్యత్తులో తాము కూడా మరిన్ని స్వదేశీ ఉత్పత్తులను ప్రవేశపెట్టే ప్రణాళికతో ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం కారణంగా ఎక్కువమంది భారతీయ వినియోగదారులు స్వదేశీ బ్రాండ్‌లవైపు మొగ్గుచూపుతున్నారని దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ ఇమామీ లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. కొవిడ్-19 నేపథ్యంలో ఇంటి అవసరాల కోసం పరిశుభ్రత ఉత్పత్తులకు ఆదరణ పెరిగిందని సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం హిందూస్తాన్ యూనిలీవర్ వంటి బహుళజాతి సంస్థలు ఇంటి పరిశుభ్రత ఉత్పత్తుల విభాగంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. భవిష్యత్తులో తాము కూడా మరిన్ని స్వదేశీ ఉత్పత్తులను ప్రవేశపెట్టే ప్రణాళికతో ఈ విభాగంలో పోటీగా నిలుస్తామని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ మోహన్ గోయెంకా చెప్పారు.
‘గత నాలుగేళ్లుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీనికితోడు తాజాగా ఆత్మనిర్భర్ భారత్ తోడయింది. దీంతో భారతీయ వినియోగదారులు నెమ్మదిగా దేశీ బ్రాండ్ల వైపునకు మారుతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తులను ప్రారంభించాలని నిర్ణయించామని మోహన్ గోయెంకా పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి మునుపే ఈ స్వదేశీ బ్రాండ్ల విభాగానికి పెరుగుతున్న డిమాండ్‌ను గమనించాం. అయితే, పోటీ తీవ్రంగా ఉన్నందున విరమించుకున్నాం. అయితే, పలు అంశాలు ఈ విభాగంలోకి వచ్చేందుకు ప్రేరేపించాయని ఆయన వెల్లడించారు.