వారం రోజుల్లోనే ఆవిరైన మస్క్ సంపద.. దారుణంగా పతనమైన షేర్లు
దిశ, వెబ్‌డెస్క్: నిన్నామొన్నటిదాకా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. గడిచిన వారం రోజుల్లోనే ఆయన సంపద భారీగా ఆవిరైంది. గత సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన ఆస్తి ఏకంగా 27 బిలియన్ డాలర్లు (సుమారు 2 లక్షల కోట్లు) కరిగిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన రెండో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ సూచీ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో అమోజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ […]
దిశ, వెబ్‌డెస్క్: నిన్నామొన్నటిదాకా ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. గడిచిన వారం రోజుల్లోనే ఆయన సంపద భారీగా ఆవిరైంది. గత సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఆయన ఆస్తి ఏకంగా 27 బిలియన్ డాలర్లు (సుమారు 2 లక్షల కోట్లు) కరిగిపోయింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన రెండో స్థానానికి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్ సూచీ ప్రకారం.. ప్రపంచ కుబేరుల జాబితాలో అమోజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రథమస్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ కంటే అతడి సంపద 20 బిలియన్ డాలర్లు ఎక్కవగా ఉంది.
గతేడాది ఆయన సంస్థ టెస్లా షేర్ల విలువ ఊహించని విధంగా పెరగడంతో ఉన్నట్టుండి ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి ఎగబాకి చరిత్ర సృష్టించారు మస్క్. దాంతో ఈ ఏడాది జనవరి వరకు పెట్టుబడిదారులు టెస్లాలో భారీగా షేర్లు కొనుగోలు చేశారు. కానీ దానిని ఎక్కువకాలం నిలుపుకోవడంలో మస్క్ విఫలమయ్యారు. జనవరి నుంచి మార్కెట్ ప్రతికూలతలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు, ఇతరత్రా కారణాల రీత్యా టెస్లా మార్కెట్ వాల్యూ కూడా పతనమవుతూ వస్తున్నది.
ఇది కూడా చదవండి : భారత్‌లో మరిన్ని ఐకియా స్టోర్లు.. వచ్చే ఏడేళ్లలో ముప్పై నగరాలకు విస్తరణ
ముఖ్యంగా గడిచిన నెల రోజులుగా అయితే టెస్లా షేర్ల విలువ దారుణంగా పతనమవుతున్నది. గతనెలలో ఆ సంస్థ షేర్ల విలువ 25 శాతానికి పడిపోయింది. ఇది క్రమంగా నేల చూపులే చూస్తున్నది. ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ వాల్యూ 574 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది జనవరిలో 837 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఇక తాజా గణాంకాల ప్రకారం.. జెఫ్ బెజోస్ సంపద 175.4 బిలియన్ డాలర్లుగా ఉంది. తర్వాతి స్థానంలో ఉన్న మస్క్ సంపద 156.9 బిలియన్ డాలర్లు.