ధాన్యం చూసేందుకు వెళ్లిన ఆ రైతు తిరిగి రాలేదు.. కారణం ఏమిటంటే?

దిశ, ఆదిలాబాద్: విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో శనివారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 5 గంటల నుంచి రెండు గంటలపాటు ఈదురు గాలులు వీచాయి. దీనికి భారీ వర్షం తోడైంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాలపై ఈ గాలి వాన ప్రభావం చూపింది. ఆయా […]

Update: 2020-05-30 01:04 GMT

దిశ, ఆదిలాబాద్: విద్యుత్ వైర్లు తగిలి రైతు మృతిచెందిన ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలో శనివారం తెల్లవారుజామున భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం 5 గంటల నుంచి రెండు గంటలపాటు ఈదురు గాలులు వీచాయి. దీనికి భారీ వర్షం తోడైంది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాలపై ఈ గాలి వాన ప్రభావం చూపింది. ఆయా గ్రామాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వడ్లు, మక్కలు తడిచిపోయాయి. జన్నారం మండలం రేలాగూడా గ్రామంలో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్లపై రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం కారణంగా రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం పడి ఉంది. ఆ ధాన్యం వర్షానికి తడిసి పోయి ఉంటుందన్న అనుమానంతో అల్లం రాజయ్య(61) అనే రైతు ధాన్యం నిల్వ చేసిన ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో మృత్యువాత పడ్డాడు. భారీ ఈదురు గాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగి కింద పడడంతో… ఆ తీగలు తగిలి విద్యుత్ షాక్ తో రైతు రాజయ్య మృతిచెందాడు.

Tags:    

Similar News