డిస్కంలపై ట్రిబ్యునల్​ ఆగ్రహం

దిశ, ఏపీ బ్యూరో: ఉత్పత్తి అయిన సోలార్​ విద్యుత్​ను తీసుకోకపోవడంపై విద్యుత్ ​అప్పిలేట్ ​ట్రిబ్యునల్ ​ఏపీ డిస్కం, ట్రాన్స్​కో సంస్థలకు తలంటింది. సోలార్‌ విద్యుత్‌ను వెంటనే కొనుగోలు చేయాలని శుక్రవారం ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం అంటే జాతీయ వృథానేనని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ సంస్థ నుంచి 50మెగావాట్ల విద్యుత్‌ను తీసుకునేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తీసుకోకపోవడానికి ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం […]

Update: 2020-09-25 10:04 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఉత్పత్తి అయిన సోలార్​ విద్యుత్​ను తీసుకోకపోవడంపై విద్యుత్ ​అప్పిలేట్ ​ట్రిబ్యునల్ ​ఏపీ డిస్కం, ట్రాన్స్​కో సంస్థలకు తలంటింది. సోలార్‌ విద్యుత్‌ను వెంటనే కొనుగోలు చేయాలని శుక్రవారం ఆదేశించింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకోకపోవడం అంటే జాతీయ వృథానేనని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. అనంతపురం సోలార్‌ ప్రైవేట్‌ సంస్థ నుంచి 50మెగావాట్ల విద్యుత్‌ను తీసుకునేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తీసుకోకపోవడానికి ఏపీ డిస్కం సంస్థలు తెలిపిన కారణాల పట్ల ట్రిబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 20కి ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది.

Tags:    

Similar News