ఈటల ఇలాఖాలో రాష్ట్ర ఎన్నికల అధికారి.. కీలక ఆదేశాలు
దిశ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల మరియు మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఈ నెల 30న జరగబోయే ఎలక్షన్‌కు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ లేకుండా, కొవిడ్ రూల్స్ పాటిస్తూ భౌతిక […]
దిశ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల మరియు మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికలో భాగంగా ఈ నెల 30న జరగబోయే ఎలక్షన్‌కు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల రద్దీ లేకుండా, కొవిడ్ రూల్స్ పాటిస్తూ భౌతిక దూరానికి సంబంధించి మార్కింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఓటర్లు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చూడాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతీ పోలింగ్ సెంటర్లో ఆశా వర్కర్లలను, ఏఎన్ఎం నర్సులను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, ఫర్నిచర్, విద్యుత్, మౌలిక వసతులు ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, సీపీ తరుణ్ జోషి, డీసీపీ పుష్ప పాల్గొన్నారు.