9 గంటలే ప్రచారం.. రూల్స్ అతిక్రమిస్తే ఊరుకోం : ఆర్ వి కర్ణన్

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకే ప్రచారం నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30న ఉదయం 7.00 నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది […]

Update: 2021-10-02 11:09 GMT

దిశ, కరీంనగర్ సిటీ : హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకే ప్రచారం నిర్వహించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 30న ఉదయం 7.00 నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, పోలింగ్ కేంద్రాల్లోని సిబ్బంది మాస్కులు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లు భౌతిక దూరం పాటించేలా చూడాలని, తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. ఓటు వేసే కుడి చేతికి చేతి తొడుగు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఏఎన్ఎం హెల్త్ వర్కర్‌ను నియమించాలని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మాస్కులు, శానిటైజర్లు, చేతి తొడుగులు, థర్మల్ స్కానర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, సాయంత్రం 7.00 తర్వాత ఎన్నికల ప్రచారం నిర్వహించే వారిపై ఎంసీసీ నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు.

సాయంత్రం 7.00 గంటల తర్వాత ధూంధాంలు, డ్యాన్సులు నిర్వహించరాదని, ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బైక్ ర్యాలీ నిర్వహించకూడదన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కఠిన చర్యలు అమలు తీసుకుంటామన్నారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి నిర్వహించే శిక్షణా కార్యక్రమాలను బ్యాచుల వారీగా నిర్వహించాలని సిబ్బంది భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్కులు ధరించి శిక్షణకు వచ్చేలా చూడాలని కలెక్టర్ నోడల్ అధికారులను ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో శానిటైజేషన్ చేయించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది తప్పనిసరిగా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ చేయించుకొవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ చేయించుకున్న పోలీస్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించాలని అడిషనల్ డీసీపీకి సూచించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఇన్‌డోర్ అయితే 200 మంది, స్టార్ క్యాంపెయినర్లతో నిర్వహించే బహిరంగ సమావేశాలకు 1,000 మందితో, సాధారణ సమావేశాలకు 500 మందికి మించకూడదని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బెల్ట్ షాపులను మూసివేయించాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఎన్నికల సామగ్రితో వెళ్లే పోలింగ్ సిబ్బందికి ఫిట్ నెస్‌తో ఉన్న వాహనాలు సమకూర్చాలని ఉపరవాణా శాఖాధికారిని ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేవల్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీముల పని తీరును జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జీవి శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ సీఈవో ప్రియాంక, నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News